NTV Telugu Site icon

పెళ్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సీజ్

తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు.. మరోపక్క ఆకతాయిలను ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. చాలా చోట్ల డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే, తాజాగా నిబంధనలను విరుద్దంగా పెళ్ళికి ఎక్కువమందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు పోలీసులు.. వికారాబాద్ జిల్లాలోని కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ పై, అలాగే పెళ్లి కూతురు తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు.