Site icon NTV Telugu

తెలంగాణలోని ఈ నియోజకవర్గాల్లో యథాతథంగా లాక్ డౌన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకిరాని ఏడు నియోజకవర్గాలలో లాక్ డౌన్ ను యథాతథంగా అమలు చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి పగలు 1 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉంటుంది. కరోనా పరిస్థిని తెలుసుకునేందుకు ఆయా నియోజకవర్గాలలో ఇటీవల పర్యటించిన రాష్ట్ర వైద్యాధికారుల బృందం.. ఈ ప్రాంతాలలో లాక్ డౌన్ ను యథాతథంగా అమలు చేయాలని కేబినెట్ కు సిఫారస్ చేసింది. దీంతో కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Exit mobile version