తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. కాగా, మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి తేదీ ఫిక్స్ అయింది. ఈనెల 30న లాక్‌డౌన్ సహా పలు అంశాలపై మంత్రులు కీలకంగా చర్చించనున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. మరో వారం రోజులు పొడిగిస్తే.. పాజిటివిటి పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉండనుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
లాక్‌డౌన్ పొడిగింపుపై స్పష్టత వచ్చేది ఆరోజే ?
