Site icon NTV Telugu

మందుబాబులకు షాక్ : నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్

మందుబాబులకు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ పరిధిలో ఇవాళ, రేపు మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం, సోమవారం.. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా మద్యం షాపులు, బార్‌ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు తెలిపారు.

Exit mobile version