NTV Telugu Site icon

తెలంగాణ‌లో మ‌ద్యానికి భారీ డిమాండ్‌… నిన్న ఒక్క‌రోజే….

తెలంగాణ‌లో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న‌ది.  ప‌ది రోజుల‌పాటు లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న‌ది. లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న త‌రువాత తెలంగాణ‌లో మ‌ద్యం కోసం మందుబాబులు ఎగ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే.  నిన్న ఒక్క‌రోజే తెలంగాణ‌లో ఏకంగా రూ.125 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మకాలు జ‌రిగాయి. లాక్‌డౌన్ మొద‌టిరోజు కూడా పెద్ద‌సంఖ్య‌లో అమ్మకాలు జ‌రిగినట్లు గ‌ణాంకాలు చెప్తున్నాయి.  ఈరోజు ఏకంగా రూ.94 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి.  ఇక ఇదిలా ఉంటే, ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు రూ. 770 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు అబ్కారీ శాఖ స్ప‌ష్టం చేసింది.