NTV Telugu Site icon

LB Nagar Police: స్వతంత్రమా నువ్వెక్కడా.. రాత్రంతా పోలీస్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ

Lb Nagar Police Stetion

Lb Nagar Police Stetion

LB Nagar Police: అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ ఆ నాడే చెప్పారు. ఈ మాట అందరికి తెలిసిందే. ఇది మనం అనుకోవడానికి చదువుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ.. జీవితంలో ఇలాంటి మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా పగలే నడవలేని పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో ఉన్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే కాపాడమని పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది పోలీసులే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఇక న్యాయం ఎవరిని అడగాలి? రాత్రి మహిళ ఒంటరిగా కనిపిస్తే జాగ్రత్తలు చెప్పి పంపించాల్సిన పోలీసులే నరకయాతన చూపించారు. రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళపై పోలీసులు చేసిన జులుం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమెను పోలీస్టేషన్ కు తీసుకుని వెళ్లడమే కాకుండా.. ఆమెపై రాత్రంతా థర్డ్ డిగ్రీని ఉపయోగించిన అమానుషకరమైన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది.

Read also: Madhya Pradesh: ఖాకీల కర్కశత్వం.. మహిళ జుట్టు పట్టుకుని రోడ్డు పై ఈడ్చుకెళ్లి.. దారుణంగా కొట్టి

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో వరలక్ష్మి నివాసం ఉంటుంది.వరలక్ష్మి భర్త శ్రీను కొన్ని నెలల క్రితమే చనిపోయాడు. వరలక్ష్మి కి కూతురు ఉంది. అయితే కూతురికి ఈ మధ్యనే పెళ్లి కుందిరింది. దీంతో వరలక్ష్మి కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ రోడ్డు వైపు లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. డబ్బులు తీసుకుని ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ కు బయలుదేరింది. వస్తున్న వరలక్ష్మి ని ఎల్బీనగర్ సర్కిల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ ప్రశ్నించారు. వరలక్ష్మి వివరాలు చెప్పిన పోలీసులు వినలేదు. నీ సంగతి తెలుసులే అంటూ పోలీసు వాహనం ఎక్కాలని కోరారు. అయితే వరలక్ష్మి .. తన కూతురు ఇంట్లో ఉందని నేను ఏ తప్పూ చేయలేదని ప్రాధేయ పడింది. అయినా పోలీసులు వినకుండా.. ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఆమెను చిత్రహింసలకి గురిచేయడమే కాకుండా.. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ.. ఇబ్బందులు గురిచేసారని బాధితురాలు వాపోయింది. రాత్రంతా వదలకుండా ఉన్నారని అన్నారని తెలిపారు. ఉదయం ఏడు గంటలకు వేరే ఆఫీసు వచ్చి ఆమెను ఇంటికి పంపించాడని తెలిపింది. పోలీసులు తనపై ఎందుకు అలా అమానుషంగా ప్రవర్తించారో తెలియదని కన్నీరుమున్నీరైంది.
Sadha : బ్యూటిఫుల్ లుక్ తో కవ్విస్తున్న సీనియర్ హీరోయిన్..