NTV Telugu Site icon

Land Dispute: సంగారెడ్డిలో భూవివాదం.. కిరాయి గుండాలతో తండ్రి, కొడుకుపై దాడి

Sangareddy

Sangareddy

Land dispute in Sangareddy district: సంగారెడ్డి జిల్లా ఝారసంఘం మండలం మాచనూరు గ్రామంలో భూ వివాదం తారాస్థాయికి చేరింది. భూమి కోసం బయటి నుంచి కిరాయి వ్యక్తులను తెప్పించి స్వరాజ్ అనే రైతు, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. వారిపై కర్రలతో, కత్తులతో కతి కిరాతకంగా ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో తండ్రి, కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే..బాధితులు సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని బాధితుల ఆరోపిస్తున్నారు.

Read also: Anu Emmanuel: రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఫైరయిన అను ఇమ్మాన్యుయేల్

ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బతుకుతున్నామని వాపోతున్నారు. మామీద కిరాయి గూండాలతో వచ్చి దాటి చేశారని రక్తం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపున నింపే మా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. వారి కుటుంబానికి ప్రాణహాని వుందని మమ్మల్ని రక్షించాలని, వారి భూమిపై నడుస్తున్న వాదనలు అప్పద్దమని వారికి న్యాయం చేయవాలని కోరుతున్నారు.

Show comments