Site icon NTV Telugu

Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు

Lady Aghori

Lady Aghori

Lady Aghori : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ నానా హల్ చల్ చేస్తోంది. ప్రతి ఆలయానికి వెళ్తూ అక్కడ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేములవాడలోని రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. లేడీ అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను జిల్లా సరిహద్దుల్లోనే ఆపేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పోలీసులు జిల్లెళ్ల చెక్ పోస్టు వద్ద భారీగా మోహరించారు. ఆమెను ఆలయం వద్దకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ లేడీ అఘోరీ మాత్రం అస్సలు వినిపించుకోవట్లేదు.

Read Also : Dil Raju: తెలంగాణ రాష్ట్రం అవార్డ్స్.. అందరూ సపోర్ట్ చేయండి !

తాను రాజన్న దర్శనం చేసుకుని తీరుతానని.. సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ నానా రకాల వ్యాఖ్యలు చేస్తోంది. రాజన్న ఆలయంలోని దర్గాను తొలగిస్తానంటూ గతంలో సంచలన వీడియోలు విడుదల చేసింది. ఇప్పుడు అందుకోసమే వస్తుందేమో అనే సమాచారంతో పోలీసులు ఆమెను ఆలయం వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. లేడీ అఘోరీ రాకతో సున్నితమైన అంశాలు వివాదాస్పదం అవుతాయేమో అని పోలీసులు భావిస్తున్నారు. ఈ నడుమ ఆలయంలోని దర్గా మీద కొన్ని హిందూ సంఘాలు కూడా ఆగ్రహం తెలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో లేడీ అఘోరీని సిరిసిల్ల జిల్లాలో అడుగు పెట్టనీయకపోవడమే మంచిదంటున్నారు.

Read Also : Nimmala Rama Naidu: చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్కు భారీగా నిధులు..

Exit mobile version