తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరం అన్నారు మంత్రి కేటీఆర్. దీనివల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు.
50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు చేరడమే లక్ష్యం. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతంగా వుందన్నారు. జీనోమ్ వ్యాలీ.. బిజినెస్ హబ్ గా మారబోతోంది. అనేక ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీలు జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి. జీనోమ్ వ్యాలీకి అనుసంధానంగా ఏర్పాటు చేయాలని అందుకు కంటోన్మెంట్ ద్వారా స్కైవేల నిర్మాణానికి అనుమతులను అడుగుతున్నాం అన్నారు. 7 ఏళ్లుగా కేంద్రం మా ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. జీనోమ్ వ్యాలీకి దగ్గరలో 5 స్టార్ హోటల్స్ కూడా రానున్నాయని కేటీఆర్ తెలిపారు.
