NTV Telugu Site icon

KTR Tweet: ఎంత అవమానం!! కేటీఆర్‌ ట్విట్‌ వైరల్

Ktr

Ktr

KTR Tweet: ప్రపంచంలోనే అరుదైన వారసత్వ కట్టడాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చార్మినార్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికార చిహ్నంలో చోటు దక్కించుకోవడంపై విస్తృత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం చార్మినార్‌పై రాజముద్ర వేయడం మరోసారి చర్చకు దారి తీస్తోంది. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్విట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా, చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చిహ్నం.. చిహ్నంగా ఉందన్నారు. హైదరాబాద్‌ గురించి తలచుకుంటే, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్‌ని తలచుకోకుండా ఉండలేరని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ ఐకానిక్ చార్మినార్‌ను రాష్ట్ర లోగో నుండి తొలగించాలని కోరుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రలో చార్మినార్‌, కాకతీయ తోరణాలు తీసేయడం ఎంత అవమానం అని కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.

Read also: Nude Photo Case: స్కానింగ్ సెంటర్ లో న్యూడ్ ఫోటోల కేసు.. మరో బడా ఆసుపత్రిలో..

మరోవైపు నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణ రాజముద్ర ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. రాజముద్ర మార్చకూడదంటూ డిమాండ్‌ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతీరణం, చార్మినార్ తొలగింపు ఎందుకు మార్పు చేయాలని నిరసనలో ప్రశ్నించనున్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. కాకతీయ కళాతోరణాలు, చార్మినార్ లను ఎందుకు తీస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read also: BRS Protest: రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు.. నేడు బీఆర్‌ఎస్‌ ఆందోళన..

నాలుగు మినార్లు (స్తంభాలు)తో హైదరాబాద్‌కు ప్రపంచ చిహ్నంగా మారిన ఈ చారిత్రక కట్టడం 433 ఏళ్ల కిందటే, అంటే 1591లో నిర్మించబడింది. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఈ బతుల్ అనే పేర్లతో ఈ తోరణాలు నిర్మించబడ్డాయి. 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో-పర్షియన్ శైలి. అందుకే పురావస్తు, వాస్తు సంపదగా సర్వే ఆఫ్ ఇండియా సిద్ధం చేసిన అధికారిక భవనాల జాబితాలో చార్మినార్ కూడా చేరింది. మహమ్మద్ ఖులీ కుతుబ్ షా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక ప్లేగుపై విజయం సాధించినందుకు రాజధానిని గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి మార్చిన సందర్భంగా చార్మినార్‌ను నిర్మించారు.
Mallu Bhatti Vikramarka: ఒడిశాలో భట్టి విక్రమార్క.. రాహుల్‌ గాంధీతో కలిసి ప్రచారం..

Show comments