Site icon NTV Telugu

KTR Tweet: అక్రమాలపై రాహుల్‌ లెక్చర్లు హాస్యాస్పదం.. కేటీఆర్‌ మరో పోస్టు

Ktr Rahul Gandhi

Ktr Rahul Gandhi

KTR Tweet: అవినీతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టిక్కెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్‌ ఇరుక్కున్నాడు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అవసరం లేదని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. ఇలాంటి వాళ్లు పార్టీలో ఉంటారని మహాత్ముడు ఊహించి ఉంటాడని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. పీసీసీ పదవిని రూ.50 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్మగా, మరొకరు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి అవినీతి పార్టీలో జరుగుతున్న అక్రమాలపై రాహుల్ ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పేరులోనే స్కాంగ్రెస్‌ అంటూ మరో పోస్ట్ పెట్టారు.

Tamannah : ట్రెండీ లుక్ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ..

కాంగ్రెస్ మూడు రోజుల బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని తెలిపారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని తెలిపారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని ట్విటర్ ద్వారా మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ..ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదన్నారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిందన్నారు కేటీఆర్.
Tamannah : ట్రెండీ లుక్ లో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ..

Exit mobile version