NTV Telugu Site icon

KTR tour in UK: క్యూలో నిల్చున్న కేటీఆర్‌.. ఆసక్తిగా వీక్షించిన ప్రయాణికులు

Ktr

Ktr

KTR tour in UK: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. బుదవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కేటీఆర్‌ యూకే బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 13 వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కంపెనీల ప్రతినిధులు వివరిస్తారు. యూకే వెళ్లేందుకు కేటీఆర్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిరాడంబరతను ప్రదర్శించారు. తనిఖీలు చేసే సమయంలో సామాన్యుడిలా క్యూలో నిల్చున్నాడు. సాధారణ ప్రయాణికులతో పాటు క్యూలో నిలబడి తనిఖీ ప్రక్రియను పూర్తి చేశారు. తనిఖీలు ముగించుకుని కేటీఆర్‌ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు.

Read also: Traffic restrictions: అలర్ట్‌.. మూడు నెలల పాటు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు

తమతో పాటు క్యూలో నిల్చున్న కేటీఆర్‌ను ప్రయాణికులు ఆసక్తిగా వీక్షించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కేటీఆర్ వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఈ వీడియోని కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరస పెట్టని సామాన్యుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ నమ్రత. క్యూ లైన్‌లో సాధారణ వ్యక్తిగా నిలిచి ఉదాహరణగా నిలుస్తాడు’. కేటీఆర్ రాష్ట్ర మంత్రి కావడంతో విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఉంటుంది. ప్రొటోకాల్ ప్రకారం, భద్రతా సిబ్బంది ప్రత్యేక ప్రవేశద్వారం ద్వారా కేటీఆర్‌ను లోపలికి అనుమతిస్తారు. అయితే కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా సాధారణ ప్రయాణికులతో క్యూలో నిల్చుని లోపలికి వెళ్లారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు లండన్‌లో పర్యటించిన కేటీఆర్.. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయి.
Top Headlines@9AM: టాప్‌ న్యూస్