Site icon NTV Telugu

Minister KTR: నేడే వేములవాడ, ఎల్లారెడ్డిపేటకు కేటీఆర్.. యువ ఆత్మీయ సమ్మేళలో మంత్రి

Miniter Ktr

Miniter Ktr

Minister KTR: మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ టెక్ సెల్ఫింగ్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీల ముఖ్య నేతలు బీఆర్ ఎస్ లో చేరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

జగిత్యాల బస్టాండ్ సమీపంలోని ఐబీపీ గోదాం గ్రౌండ్‌లో జరిగిన యువజన స్ఫూర్తి సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్ధపు మాధవి, బండ నర్సయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో. లోక బాపురెడ్డి పాల్గొంటారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు యువ ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. నాఫ్‌స్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, టీపీటీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆరు మండలాల జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
Double Ismart : ఆ పాత్ర కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Exit mobile version