KTR: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ లీడర్ గా ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే. ఇక కేటీఆర్ రాజకీయాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. కేటీఆర్ విదేశాల్లో చదువుకొని వచ్చిన విషయం విదితమే. ఇక కొద్దిగా గ్యాప్ దొరికినా ఆయన గత స్మృతులను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆయన త్రో బ్యాక్ పిక్ ఒకటి ట్విట్టర్ లో షేర్ చేయడం అది కాస్తా వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి. డాన్ మోడ్ అని క్యాప్షన్ పెట్టిన ఈ ఫొటోలో కేటీఆర్ డాన్ లానే ఉన్నారు. చుట్టూ బాడీ గార్డ్స్ మధ్య డాన్ లా నడుస్తూ కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ దానిమీద బ్లాక్ కోట్.. బ్లాక్ గాగుల్స్ తో కేటీఆర్ హాలీవుడ్ హీరోలా కనిపించారు. త్రో బ్యాక్ పిక్ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.. ఇక హీరోలా ఉన్నారు ఒక సినిమా తీయండి అని కొందరు.. కేటీఆర్ ఎక్కడ ఉన్నా కింగే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
