NTV Telugu Site icon

KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు.. కేటీఆర్ కీలక వ్యాఖ్య

Ktr

Ktr

KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు కీలక వ్యాఖ్యాలు చేసారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి విజయం మనదే అన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రెవంత్ గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపు నిచ్చారని తెలిపారు. వారి మాటలనే నేను గుర్తు చేశానని అన్నారు. నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని తెలిపారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా ? అని ప్రశ్నించారు. సోనియా నే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు ..కరెంటు బిల్లులు సోనియా కే పంపుదాం అన్నారు. సోనియా కు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలన్నారు.

Read also: Sania Mirza Divorce: కొన్ని నెలల క్రితమే షోయబ్ మాలిక్‌కు సానియా విడాకులు.. అనవసర చర్చలు ఆపేయండి!

ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు ..విలాసాలే అందులో ఉంటె భట్టి ఈ పాటికే టాం టాం చేయక పోయేవారా? అని ప్రశ్నించారు. ఆన్లైన్ లో రేషన్ కార్డులు ఇచ్చాము ..ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీ లు కూడా పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఇక ముందు ఆలా జరగదని తెలిపారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవన్నారు. కార్ కేవలం సర్వీసింగ్ కు వెళ్ళిందన్నారు. మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ టీం కాదు ..బీజేపీ ,కాంగ్రెస్ లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అని ప్రశ్నించారు.
MLC Kavitha: ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టండి.. స్పీకర్ కు కవిత వినతి