Site icon NTV Telugu

KTR: మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తాం..!

Ktr

Ktr

KTR: మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టంకట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు చేసే వెదవ పని గుర్తుకొస్తుందని అన్నారు. ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో కరెంట్ పోలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందన్నారు. డిసెంబర్ 9 న రైతులు లోన్లు తెచ్చుకో అన్నాడు, ఇప్పటి దాకా రుణమాఫీ చేయలేదన్నారు.

Read also: UP : బాలిక కళ్లు కొట్టేసిన ఎలుకలు.. ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగిన కుటుంబ సభ్యులు

డిసెంబర్ 9, జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9వచ్చింది ఇంకా రుణమాఫీ కాలేదని తెలిపారు. 500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తామన్నారు ఇవ్వలేదన్నారు. 70 ఏళ్ల వ్యక్తి కేసిఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎం స్థాయి మరిచి కేసిఆర్ ను తిడుతున్నారని మండిపడ్డారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చారించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారని తెలిపారు. పదేళ్లు మోడీ మాకు సహకరించక పోయిన మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఇలా ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గటం మంచిది కాదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు ఉండాలన్నారు.

Read also: Canada–India relations: భారత్‌పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ పాలన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను చిన్న పిల్లలకు కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. అభివృద్ధి కోసం హైదరాబాద్ ఓటర్లు బుద్ధి చెప్పి ఓట్లు వేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ ఎస్ పార్టీకి మధ్య 1.8 శాతం తేడా మాత్రమే ఉందని, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తమకు నోరు ఉందని, వంద రోజులు ఓపిక పట్టాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గల్లీలకు నీటి ట్యాంకర్లు వస్తున్నాయన్నారు.
Telangana Hemo Lab: హీమో ల్యాబ్స్ కి నో పర్మిషన్.. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆదేశాలు

Exit mobile version