Site icon NTV Telugu

KTR V/s Bhatti: భట్టి పై కేటీఆర్ సెటైర్.. 9 నెలల్లో పిల్లులు వస్తారు కానీ..

Bhatti Vikrabarka, Ktr

Bhatti Vikrabarka, Ktr

KTR satire on Bhatti Vikramarka: 9 నెలల్లో మేము వస్తాం అని భట్టి అన్నారు.. 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ.. మీరు రారంటూ మంత్రి కేటీఆర్‌ సెటైర్‌ వేశారు. ఏది చెప్పినా.. పాత ముచ్చట చెప్తారని ఎద్దేవ చేశారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చెప్పారన్నారు. సబ్జెక్టు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. 9 నెలల్లో మీరు రారు.. ఇంత చేసినా కూడా.. వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా వస్తారో కూడా తెలియదు.. బయటకి వెళ్ళేటట్టు ఉన్నారంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు.

Read also: Record electricity: తెలంగాణలో విద్యుత్ ఆల్ టైం రికార్డ్.. చుక్కలను తాకుతున్న కరెంట్‌

మెట్రో చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో చట్టం ప్రకారం.. మేనేజింగ్ బాడీలకు ఎంత ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించే అధికారం ఉంటుంది. ప్రస్తుతం మెట్రో బాధ్యతలను ఎల్ అండ్ టీ నిర్వహిస్తోంది. చార్జీలు పెంచాలని నిర్ణయించి అమలు చేసింది ఆ సంస్థేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్‌అండ్‌టీకి తగిన సూచనలు చేశామని మంత్రి సమావేశంలో వెల్లడించారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో సమానంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. మెట్రో ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి విమర్శించారు. మహాకూటమి పాలిత రాష్ట్రాల్లో మహానగరాలకు భారీగా నిధులు కేటాయించారని, తెలంగాణలో మాత్రం మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు. భోజనం చేసే కార్యక్రమంలో ఎక్కడ కూర్చున్నా అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు.

Read also: Lalu Prasad Yadav: భారత్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. కూతురు ఎమోషనల్ ట్వీట్

అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ మెట్రో కొత్త నిర్మాణానికి ధర పెంచారని మండిపడ్డారు. ఎందుకు పెంచారంటూ ప్రశ్నించారు. మెట్రో తెచ్చింది మేము.. సంగారెడ్డి వరకు మెట్రో ఇవ్వండని డిమాండ్‌ చేశారు. యాడ్స్ మిగిలిన సంస్థలకు కోత పెట్టి, మెట్రోకీ అంట గడుతున్నారని తెలిపారు. వాళ్లేమో తమ అనుకూల పార్టీలకు యాడ్స్ ఇచ్చుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఇక కేటీఆర్ ని కలవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు వచ్చారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం కేటీఆర్ ని కలవడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే దీనిపై కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో అనేదానిపై ఆశక్తి నెలకొంది.
Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేయనున్న బండా ప్రకాష్

Exit mobile version