Site icon NTV Telugu

KTR: నేడు ఖైరతాబాద్‌ లో కేటీఆర్‌ రోడ్‌ షో

Ktr

Ktr

KTR: పోలింగ్ కు 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ పాలకులపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థి అభ్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉంటుందని బీఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. సాయంత్రం 7:00 గంటలకు షేక్‌పేట్ మరియు జూబ్లీహిల్స్ డివిజన్‌లలో, ఫిలింనగర్‌లోని గౌతంనగర్ స్క్వేర్, బంజారాహిల్స్ రోడ్ నెం.10లో రాత్రి 7:30 గంటలకు జహీరానగర్ చౌరస్తా, బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్ నగర్ లో రోడ్ షో, సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read also: KCR: నేడు మెదక్ లో కేసీఆర్ బస్సు యాత్ర..

మరోవైపు కుల సంఘాలు, ఆత్మీయ సభలు, పార్ల మెంటు ముఖ్య నేతలతో సమావేశ మవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించి ఆదుకోవాలన్నారు. ప్రతిరోజూ రెండు, మూడు రోడ్ షోలలో పాల్గొంటూ క్యాడర్ అంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ వైపు ప్రజలను ఆకర్షించేందుకు తమదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రతి పార్లమెంట్ ఏరియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తన పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి దాదాపు 40 రోజులు అయ్యింది. అన్ని వర్గాలతోనూ సమావేశమవుతున్నారు. సమ్మేళనాల ద్వారా నిర్వహించబడింది.
Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?

Exit mobile version