Site icon NTV Telugu

KTR Tweet Latest: అందువల్లే బొగ్గు కొరత.. కేటీఆర్ ఫైర్

Ktr Tweet Latest

Ktr Tweet Latest

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తరచూ ట్విటర్‌లో కేంద్ర విధానాలను ఎండగట్టే మంత్రి.. విశ్రాంతి సమయంలోనూ కేంద్రంపై ట్వీట్ వార్ కొనసాగించారు. ట్విటర్ వేదికగా.. మరోసారి మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. బొగ్గు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై వ్యంగ్యంగా స్పందించారు. మోదీ సర్కార్‌ ప్రణాళికా లోపం.. ముందుచూపు లేక దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు.

NPA ప్రభుత్వంలో ప్రాథమిక ప్రణాళిక, దూరదృష్టి లేకపోవడం వల్ల దేశీయ బొగ్గు కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే..10 రెట్లు ఎక్కువ ఖరీదైన బొగ్గు దిగుమతి తప్పనిసరి కాబట్టి.. తదుపరిసారి మీ పవర్ టారిఫ్ పెరిగినప్పుడు, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో మీ అందరికి తెలుసు అని ఇద్దేవా చేశారు. నేడు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్రస్థాయిలో కేటీఆర్‌ మండిపడ్డారు. దేశంలో 100 సంవత్సరాల పాటు ఉండే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని పేర్కొన్నా ఆయన కానీ.. కేంద్రం మాత్రం దేశీయ బొగ్గు కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందని కేటీఆర్‌ ఆరోపిస్తూ ట్వీట్‌ చేసారు.

Exit mobile version