KTR: తెలంగాణ ఉద్యమంను తొక్కింది ఎవరు? బలి దేవత అన్నది ఎవరు ? అంటూ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడినవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఉన్నాయన్నారు. సీఎం అయిన తర్వాత అయినా గౌరవంగా మాట్లాడతరు అనుకున్నామన్నారు. కేసీఆర్ ని ఏకవచనంతో మాట్లాడినప్పుడే అర్థమైంది ఆయన సంస్కారం ఏందో అర్థమైందన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు అంటున్నాడు.. దామన్న.. భట్టి పార్టీలో పాములా వచ్చి చేరిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో వచ్చిన తర్వాత మరుతారు అనుకున్నామన్నారు. అచ్చోసిన అంబోతులు అని రేవంత్ అంటున్నారు. ఎన్ఆర్ఐలు టికెట్ అమ్ముకున్నది ఎవరు అన్నది ? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు.. ఢిల్లీ నామినేటెడ్ ముఖ్యమంత్రి అని నేను అదే చెప్పా అన్నారు. బయట దేశం వాళ్ళను అధ్యక్షు రాలిని చేసుకున్న దుస్థితి కాంగ్రెస్ ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మ్యానీఫెస్ట్ లోని అన్ని హామీలను అమలు చేయండి అన్నారు.
ITIR అంటే ఏమిటో అధికార పక్ష సభ్యులకు తెలుసా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ITIR లేకున్న సాధించాం అన్నారు. ప్రజా వాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి ? అని ప్రశ్నించారు. ప్తిర సోమ వారం జిల్లాలో నడుస్తుందన్నారు. కంచెలు తీసినం అని బిల్డప్ ను నమ్మరన్నారు. కంచెలు వేసింది… కాంగ్రెస్ హయంలోనే అన్నారు. భట్టి నియోజక వర్గంలో హామీల అఫిడవిట్ ఇచ్చారు… అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికీ మూడు క్యాబినెట్ మీటింగ్ లు అయ్యాయి… హామీల అమలు ఊసు లేదన్నారు. ఆటో డ్రైవర్ లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఒకటి రెండు కాదు…చాలా హామీలు ఇచ్చారన్నారు. ఎవరి వల్ల చనిపోయి అమరులు అయ్యారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంను తొక్కింది ఎవరు? బలి దేవత అన్నది ఎవరు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్బంధం గురించి మాట్లాడింది జోక్ లాగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ముఠాలు పెంచి పోషింది ఎవరు ? చర్చల కోసం నక్సలైట్ ను పిలిచి చంపింది ఎవరు ? పౌర హక్కుల గురించి సీతక్కకు తెలుసు అన్నారు.
Read also: Harish Rao: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందే టీఆర్ఎస్..
ఇప్పటికే శ్వేత పత్రాలు ప్రకటించాము. కొత్తగా కాంగ్రెస్ సర్కార్ లో చెప్పేది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కరెంట్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ సర్కార్ గత పాలన గురించి రాస్తే రామాయణం… చెబితే మహాభారతం అవుతుందన్నారు. విద్యుత్ సంస్థలను అప్పుల పాలు చేశాం అంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖలో ఆస్తులను పెంచామన్నారు. 2014 లో దురవస్థలో విద్యుత్ శాఖను అప్పగించారని తెలిపారు. లంబాడీల గురువు సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలన్నారు. లంబాడీల జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని తెలిపారు. అప్పట్లో విపక్ష నేతగా భట్టి విక్రమార్క బాగా మాట్లాడారు…సిఎం అవుతారు అనుకున్నాం …కానీ కాలేదన్నారు.
విపక్ష నేతగా భట్టి బాగా మాట్లాడారు… అందుకే అధికారంలోకి వచ్చారని తెలిపారు. అప్పులు…ఆస్తులను కలిపి చూడాలన్నారు. అమెరికా ,జపాన్ లకు కూడా అప్పులు ఉన్నాయని, కొత్తగా తెలంగాణ సర్కార్ నివేదిక విడుదల చేసిందన్నారు. పర్ఫామెన్స్ మాది …ఫోటోలు కాంగ్రెస్ వారివి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మాపై విమర్శలు చేయండి…రాష్ట్రం ను అప్రతిష్ఠ పాలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్