NTV Telugu Site icon

KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్

Ktr

Ktr

KTR: తెలంగాణ జర్నలిస్టులు అందరికీ త్వరలో ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించినట్లు ఆయన వివరించారు. అలాగే శనివారం ఢిల్లీ టీడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌తో జర్నలిస్టుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులను కూడా సంప్రదిస్తామన్నారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందే వీలుంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి, హైదరాబాద్ జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లు మంజూరు చేస్తారు.

Read also: House Lifting: హైదరాబాద్‌లో పక్కకు ఒరిగిన బిల్డింగ్.. కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశం

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం, మద్దతు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మేడపట్ల సురేష్, షేక్ మోయిజ్
గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసీఆర్ పదే పదే లేవనెత్తారు.

కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగలేదన్నారు. దీంతో జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి జిల్లా ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో చాలా చోట్ల జర్నలిస్టులకు స్థలాలు కేటాయించామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.
Adipurush: నీ నామస్మరణ మహిమాన్వితం రామా…