Site icon NTV Telugu

Amshala Swamy: అంశాల స్వామి మృతి.. కేటీఆర్ ప్రగాఢ సంతాపం

Ktr

Ktr

Amshala Swamy: ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి 32 ఏళ్లు. అయితే బైక్ పై నుంచి పడిపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. నల్గొండ జిల్లా ప్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నాయకుడు అట్టా స్వామి. అంశాల మృతి పట్ల రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. అంశాల ఫ్లోరోసిస్‌ బాధితుడు, వారి కోసం నిరంతరం పోరాడాడు. ఆయన ఎంతతో మందికి స్పూర్తి .. అంశాలస్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడు..అతని ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకున్నారు. అంశాల స్వామితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు కేటీఆర్‌.

కాగా.. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ లో అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశారు. కాగా.. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా మునుగోడు వెళ్లిన కేటీఆర్.. ఆ తర్వాత శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామిని కలిశారు. ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు అంశాల స్వామితో కేటీఆర్ మాట్లాడారు. అంశాల స్వామి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, అంతేకాకుండా.. హెయిర్ కటింగ్ సెలూన్, ఇంటి నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన గతంలోనూ అంశాల స్వామి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆర్థిక సహాయం కూడా చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ. 5.50 లక్షలు మంజూరు కూడా చేయించారు…మిగతా ఇంటి నిర్మాణ పనులను కేటీఆర్ కార్యాలయంతో పర్యవేక్షించి పూర్తయ్యేలా చొరవ కూడా చూపారు.

Exit mobile version