Site icon NTV Telugu

ఈటలకు కౌశిక్ రెడ్డి కౌంటర్ : పంచాయితీ నీకు..కెసిఆర్ కే !

ఈటల చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు పంపిస్తే… రెండున్నర యేండ్ల నుండి ఎందుకు మాట్లాడలేదని.. ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని ఫైర్ అయ్యారు. ఈటెల ప్రస్ట్రెషన్ లో ఉన్నాడని.. పైసలు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈటెల వల్ల..ఊరు కాలదు..పేరు లేవదు అని..అధికారంలో ఉన్నప్పుడే ఈటల మీద పోరాడా ? ఇప్పుడు పోరాడతా అని పేర్కొన్నారు. ఇవాళ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన ఈటెల.. ఇన్నాళ్లు ఎక్కడ పోయారని నిలదీశారు. ఇన్నాళ్లు అమర వీరుల స్తూపం దగ్గరకు ఎందుకు పోలేదు.. ఒక్క అమర వీరుల కుటుంబాన్ని పరామర్శంచిన దాఖలాలు ఉన్నాయా..? అని నిలదీశారు. ఈటెల నువ్వు ఒక్కటి మాట్లాడితే… నేను రెండు మాట్లాడతా అని ఫైర్ అయ్యారు. పంచాయతీ నీకు..కెసిఆర్ కు.. మధ్యలో నన్ను లాగితే ఊరుకోనని హెచ్చరించారు. హుజురాబాద్ లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని..నన్ను తెరాసలోకి రమ్మని ఎవరు అడగలేదన్నారు. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version