Koti Deepotsavam 2025 Day 4: భక్తి జ్యోతులతో మెరిసిన ఎన్టీఆర్ స్టేడియం.. వైభవంగా శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 4: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది.
నాల్గవరోజు కార్యక్రమం గురువుల ఆశీస్సులతో, వేద మంత్రాలతో ప్రారంభమైంది. పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి మహాస్వామీజీ (శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతి, ఏర్పేడు), పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ (హల్దీపురం పీఠాధిపతి, వైశ్య కుల గురువులు) ఆధ్వర్యంలో జరిగిన అనుగ్రహ భాషణం భక్తుల హృదయాలను తాకింది. తదుపరి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రవచనామృతం భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తింది. అయితే.. నాల్గవ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీసమేతంగా విచ్చేశారు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం

అలాగే వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, రజత గోమాత పూజ, శత అష్టోత్తర పంచహారతులు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. అనంతరం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో భక్తులకు దివ్య దర్శనం లభించింది. చివరలో సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో నాలుగవ రోజు వేడుక కన్నుల పండువగా ముగిసింది. వేలాది దీపాలతో ప్రకాశించిన వేదిక కైలాసాన్ని తలపించింది.
కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అందరినీ ఆహ్వానిస్తోంది.
శ్రీ గోదాదేవి – రంగనాథస్వామి కల్యాణోత్సవంలో పుణ్యఫలాన్ని ఇచ్చే పట్టువస్త్ర సమర్పణ..#SriGodaRanganathaSwamyKalyanam #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/C2AWYIaOs9
— BhakthiTV (@BhakthiTVorg) November 4, 2025
సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల లభించే పుణ్యఫలాలు..#SriSatyanarayanaSwamyVratham #BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/hLvzI6psHc
— BhakthiTV (@BhakthiTVorg) November 4, 2025
తాజావార్తలు
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!