Site icon NTV Telugu

Kotha Prabhakar: ఎంపీ పదవికి కోట ప్రభాకర్‌ రాజీనామా.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ

Kota Prabhaker

Kota Prabhaker

Kotha Prabhakar: బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కోట ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ప్రభాకర్ రెడ్డి.. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కాగా, 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి రఘునందన్ రావుపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

Read also: Telangana Speaker: స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు.. అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావ్

గతంలో ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం దాడి చేసిన విసయం తెలిసిందే. అయితే ఎంపీ పై దాడిచేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడిచేసింది రాజు అనే వ్యక్తి అని పోలీసులు స్పష్టం చేశారు. అయితే రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజుపై ఇప్పటికే సెక్షన్ 307, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజుపై ఏ1గా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ అయ్యగారి నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వారు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..
Merugu Nagarjuna: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున.. ఏమన్నారంటే..?

Exit mobile version