NTV Telugu Site icon

కేసీఆర్ కేబినెట్ లో ఈటలకు.. ఎప్పుడు కూడా గౌరవం తగ్గలేదు

ఈటెల రాజేందర్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 2001లో టీఆరెస్ పార్టీని కేసీఆర్ పెడితే అనేక మంది 69 ఉద్యమంలో ఉన్న వాళ్ళు మమేకం అయ్యారని..ఈటల రాజేందర్ 2003 టీఆరెస్ పార్టీలో చేరారని కొప్పుల గుర్తు చేశారు. ఈటల రాజేందర్ కు గౌరవం దక్కలేదు అనే మాటలు అత్యంత సత్యదూరమని..రాజేందర్ కు గౌరవం ఇచ్చారు కాబట్టే మొదట కమలాపూర్ లో టికెట్ ఇచ్చారన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఈటలకు ఎప్పుడు కూడా గౌరవం తగ్గలేదని.. గడిచిన నాలుగు ఏళ్ల నుంచి ఈటల అసంతృప్తిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఈటెల మాటలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని.. ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తున్న వాళ్లకు ఇప్పటికీ గౌరవం దక్కని వాళ్ళు పార్టీలో పనిచేస్తున్నారని..పార్టీతో అనేక రకాలుగా ఈటల లబ్ది పొందారని చురకలు అంటించారు. వ్యాపారం అభివృద్ధి కోసం అసైన్డ్ భూములను కొన్నాను అని ఈటల స్వయంగా ఒప్పుకున్నారని.. దళితుల నుంచి తక్కువ ధరకు భూములు కొనాలని ఎలా అనిపించింది ? 50 లక్షల నుంచి కోటిన్నర రూపాయలకు ఎకరం పలికే భూమిని ఆరు లక్షలకు ఎలా కొంటావని నిప్పులు చెరిగారు కొప్పుల. దేవరయంజాల్ దగ్గర దేవాదాయ భూములు కొన్నట్లు స్వయంగా అంగీకరించారు.. ఎన్ని సార్లు ఈటెల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా మీ గౌరవానికి ఎక్కడా తగ్గలేదన్నారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ఈటెల రాజేందర్ ఉద్దేశమా? అని మండిపడ్డారు.