Site icon NTV Telugu

Kunamneni: సీపీఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కూనంనేని కామెంట్‌..

Kunamneni

Kunamneni

Kunamneni: సీపీఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అణిచివేతను సహించరని అన్నారు. అందుకే కేసీఆర్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నిజాం ప్రజల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే పోరాటం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా అణిచివేత వల్లే పుట్టిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళనలు చేసే స్వేచ్చ అయినా ఉండేది.. కేసీఆర్ పాలనలో అది కూడా లేదన్నారు.

Read also: Cyclone Michuang Updates: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్!

నిర్బంధాలు తెలంగాణ అంగీకరించదు అనేది మొన్నటి తీర్పు చెప్పిందని అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అణిచివేత లేకుండా కాంగ్రెస్ పాలన జరగాలని అన్నారు. కాంగ్రెస్ కమ్యునిస్ట్ ల పొందిక కలిసి వచ్చిందని తెలిపారు. కమ్యునిస్ట్ ప్రభావం ఉన్న ప్రతీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఒక్కరైనా కమ్యునిస్ట్ అసెంబ్లీలో ఉండాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. నా గెలుపు అందరి సహకారం ఉందని తెలిపారు. కొత్తగూడెం సెగ్మెంట్ లో గతంలో ఎప్పుడూ రాని మెజారిటీ వచ్చిందని తెలిపారు. కమ్యునిస్ట్ గొంతును అసెంబ్లీ లో వినిపించేందుకు నా ప్రయత్నం చేస్తా అని.. భవిషత్ లో మా నిర్మాణం కు కృషి చేసుకుంటామని అన్నారు.
INDIA Meeting: అఖిలేష్‌, నితీష్‌, మమత వైఖరి.. వాయిదా పడిన ఇండియా కూటమి మీటింగ్

Exit mobile version