Site icon NTV Telugu

Bhatti Vikramarka: మీ వెంటే నేను ఉంటా.. భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్

Bhatti, Komatireddy

Bhatti, Komatireddy

Komatireddy Venkatareddy Phone to Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఇవాల హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంపై ఆరాతీసిన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే నేనుంటా అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. కోమటిరెడ్డి ఫోన్ కాల్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు నిప్పులు చెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Read also: Leopard At Hetero Update : చిరుతకోసం అన్వేషణ.. 11 గంటలుగా అధికారుల హైరానా

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల ప్రకటన చిచ్చు రేపిన విషయం తెలిసిందే.. పలువురు సీనియర్ నేతలు కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ, బెల్లయ్య నాయక్ వంటి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయగా, పీసీసీ కమిటీలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇక, సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారని, తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు భట్టి విక్రమార్కను కలిసి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక.. మరోవైపు సీనియర్ నేత దామోదర రాజనర్సింహ పార్టీలో కోవర్టులు ఉన్నారనే కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలోనే టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ తీరుపై పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈసమావేశానికి మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, డిప్యూజీ మాజీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ హాజరయ్యారైన విషయం తెలిసిందే.
Alexander Dugin: గెలిచే దాకా యుద్ధం ఆగదు.. లేదంటే ప్రపంచ వినాశనమే

Exit mobile version