NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: రైతులకు అంతేనా పరిహారం..! అది ఎలా సరిపోతుంది?

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే రైతులకు ఎలా సరిపోతుంది? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల వాన తో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రైతులను మేము కలిసామని, సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చెయ్యలేదు, 50 వేలు మాత్రమే రైతులకు రుణ మాఫీ అయ్యిందని అన్నారు. కొన్ని చోట్ల 25 వేలు మాత్రమే మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు భువనగిరిలో 4 వేల దరఖాస్తులు, 2300 దరఖాస్తులు అనర్హులుగా తేల్చారు. దానిలో అర్హులు లేరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదనంగా పేదలకు 2000 ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read also: Gutha Sukender Reddy: కేటీఆర్‌ పై కుట్రలు చేస్తున్నారు.. కేంద్రంపై గుత్తా సీరియస్

భువనగిరి లో 430 ఇళ్లు మాత్రమే ఉన్నాయని, ఆలేరు లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నీట మునిగాయని కోమటి రెడ్డి అన్నారు. ఉద్యోగుల విభజన లో భాగంగా ఉద్యోగులు కూడా ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.టీచర్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 10 వేలు ఖాళీలు కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో ముడి పడి ఉన్న సమస్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల ప్రశ్నత్రాల లీకేజీ పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోమ్ మినిస్టర్ ని కలుస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పాస్ వర్డ్ లు మీ వద్దనే ఉండాలని ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ పై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 ఏళ్లు శిక్ష విధించిందని, పై కోర్టులు ఉన్నా అనర్హత వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఐక్యత కోసం తన కుటుంబంలో వ్యక్తులను కొల్పయాడని, ప్రజలందరూ రాహుల్ గాంధీకి సంఘీభావం తెలపాలన్నారు. రాహుల్ పై తీసుకున్న నిర్ణయం పై దేశం మొత్తం ఆశ్చర్య వ్యక్తం చేసింది.
Vishwak Sen: మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన విశ్వక్ సేన్.. డైరెక్టర్ ఎవరంటే?