NTV Telugu Site icon

Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy’s sensational comments on party change: తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మార్పు వార్తలను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాహుల్ గాంధీని అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నా అని స్పష్టం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని, నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు.. నాది కాంగ్రెస్ రక్తమని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని నన్ను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయొద్దని తెలిపారు. పార్టీ మారేది ఉంటే నేనే ప్రకటిస్తా అన్నారు. నేను పార్టీ మారతా అనే విషయాన్ని ఖండించడం కూడా బాధాకరంగా ఉందని అన్నారు. పార్టీ మారేవాడినే అయితే పిసిసి పదవి ఇవ్వనప్పుడే నేను పార్టీ మారేవాడిని అంటూ సంచలన వాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం పై కొన్ని కామెంట్లు చేసింది వాస్తవమే అన్నారు.

సోనియా రాహుల్ తో చర్చల తర్వాత నా సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానిని కేంద్ర మంత్రులు కలుస్తున్నాను కాబట్టి పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చాయి అనుకుంటున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి అని ,బిఆర్ఎస్ లో చేరుతున్నానన్న వార్తలు కూడా చూస్తున్నానని,
ఎమ్మెల్యేలగా ,మంత్రి పదవి వదలి తెలంగాణ కోసం పోరాడా అని తెలిపారు. నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ థాకరే తో రాష్ట్ర కాంగ్రెస్ వ్య్వహారాలపై చర్చించామన్నారు. పార్టీ టికెట్లు త్వరగా ఇవ్వాలని గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలని కోరామన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరా అని అన్నారు. పార్టీ మార్పు ప్రచారాలు నమ్మొద్దని,
పార్టీ మారేది ఉంటే కార్యకర్తలని నా అభిమానుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటా అని తెలిపారు. మళ్ళీ పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తా అని స్పష్టం చేశారు. పార్టీలో పదవి వస్తుందని ఆశిస్తున్నాను..పార్టీ మరే ప్రసక్తి లేదని అన్నారు.

Read also: Kane Williamson: కివీస్‌కు భారీ షాక్.. కేన్ మామకు సర్జరీ.. వరల్డ్ కప్ ఆడటం డౌటే..?

గతేడాది చివర్లో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సొంత సోదరుడు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండగా వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

Read also: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం

ఈ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్‌లో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అంతకుముందు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఫోన్ చేసి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ షోకాజ్ నోటీసులను పార్టీ చెత్తబుట్టలో పడేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వెంకట్ రెడ్డితో సమావేశమై రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అయితే తాజాగా వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
Adipurush : ఆదిపురుష్ అప్ డేట్.. హనుమాన్ పోస్టర్ రిలీజ్