NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్‌

Lomati Reddy Modi

Lomati Reddy Modi

Komatireddy Venkat Reddy: మాది RR కాదు మీది AA.. పీఎం మోడీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. మేము అధికారంలో ఉన్నది ఎన్ని రోజులు… కమిషన్ లు ఎక్కడ వచ్చినయ్? అని ప్రశ్నించారు. ఖర్చులు మిగిలిస్తున్నాం మేము అన్నారు. RR టాక్స్ రాజకీయ విమర్శ అన్నారు. కేసీఆర్ ఖజానా అంతా ఖాళీ అయ్యిందన్నారు. ఒకటో తేదీ జీతం వచ్చేది కాదన్నారు. మాది RR కాదు.. మీది AA అని మండిపడ్డారు.

Read also: Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఆధాని..అంబానీ తప్పా.. మీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? అని ప్రశ్నించారు. A A కె దేశాన్ని దోచిపెట్టారన్నారు. మా పార్టీలో కొంత మంది పదవుల కోసం ఢిల్లీ వెళ్లారన్నారు. కానీ నేను వెళ్ళలేదు.. పార్టీ క్యాంప్ లో ఉండు అంటే ఉన్న అన్నారు. సీఎం కూడా మాతో ఫ్రెండ్ లాగా ఉన్నాడన్నారు. సీనియర్లను గౌరవిస్తున్నారు.. వచ్చే ఐదేళ్లు కాదు.. ఇంకో ఐద్వెళ్ల పాటు సీఎం గా రేవంత్ ఉంటారన్నారు. షిండే లు ఎవరు లేరని క్లారిటీ ఇచ్చారు. ఉత్తమ్ తో సహా అందరం హ్యాపీగా ఉన్నామన్నారు.

Read also: Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారు..

పార్లమెంట్ ఎన్నికలు కీలక ఎన్నికలన్నారు. మోడీ ..అచ్చె దిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారని మండిపడ్డారు. బ్లాక్ మని తేలేదు.. రూ.15 లక్షలు దేవుడు ఎరుగు.. 15 పైసలు కూడా జన్ ధన్ ఖాతాలో పడలేదన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి.. రాముడు పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి మోడీ వచ్చాడన్నారు. మతాల అంశం చర్చకు వచ్చింది అంటే మోడీ ఓటమి అక్కడే బయటపడిందని అన్నారు. రూ.400 సిలిండర్ ను రూ. 1200 అయ్యింది.. దాని గురించి మాట్లాడరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూడాయిల్ ధర తగ్గింది.. కానీ పెట్రో ధరలు పెరిగాయన్నారు. ఎన్డీఏ కూటమే మా టార్గెట్ అన్నారు.

Read also: PM Modi: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌ని ఎంఐఎంకి రాసిచ్చింది..

ఒక మతాన్ని టార్గెట్ చేస్తే… జరగరానిది జరిగితే.. మిలటరీ కూడా ఆపలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మోడీ, అమిత్ షా లు మట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందువుల ఓట్లు వస్తాయని.. మైనార్టీలను టార్గెట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మూడో సారి ప్రధాని అయితే.. 2029 లో ఎన్నికలు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-చైనా లాగా మారిపోతుందన్నారు. రైతులను బార్డర్ లో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర అడిగితే ఇవ్వడం లేదన్నారు. మళ్ళీ మోడీ ప్రధాని అయితే.. రాజుల పాలన వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా టార్గెట్ 15 సీట్లు..14 గెలుస్తామన్నారు.
PM Modi: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని.. సభలో మోడీ ప్రసంగం..