NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది

Venkat Reddy On Alliance

Venkat Reddy On Alliance

Komatireddy Venkat Reddy Gives Clarity On His BRS Congress Alliance Comments: వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ చేతులు కలుపుతారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. వరంగల్ సభలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగానే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తాను స్వతహాగా ఎలాంటి సర్వేలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలపై రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని.. తన వ్యాఖ్యలు ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమవుతుందని అన్నారు. హంగ్ వస్తుందని తాను అనలేదని పేర్కొన్నారు. చిన్న చిన్న నాయకులు సైతం తనని తిట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనని వెల్లడించారు. తాను కన్ఫ్యూజన్‌లో ఉన్నానని బీజేపీ వాళ్లు అంటున్నారని, అయితే వారే అయోమయంలో ఉన్నారన్న విషయం వాళ్లకు తెలియడం లేదని చురకలంటించారు. తానేం తానేం తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు

కాగా.. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి, వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎలెక్షన్స్‌లో ఏ పార్టీకి సొంతంగా 60 సీట్లు రావని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సెక్యులర్ పార్టీలని.. అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, కానీ ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని ప్రకటించారు. అయితే.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి తిరిగొచ్చాక వెంకటరెడ్డి పేర్కొన్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. వారిద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని థాక్రే తేల్చి చెప్పారు. వరంగల్ సభలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Jagapathi Babu: పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశా.. చిన్నదానికి నేను పెళ్లి చేయను