Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: గాంధీ ఆస్పత్రిపై కోమటి రెడ్డి కామెంట్స్

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం తెలిపారు. కాంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. లాస్య మృతి చాలా బాధాకరమన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు… తండ్రి మాదిరిగానే జనాల్లో ఉండి పనిచేశారని అన్నారు. తండ్రి చనిపోయి సంవత్సరికం నాలుగు రోజుల క్రితమే చేసుకున్నారని.. అంతలోపే లాస్య నందిత చనిపోవడం బాధాకరమన్నారు.

Read also: Telangana Youth: పుతిన్‌ సైన్యంలో తెలంగాణ యువకులు.. కుటుంబీకుల ఆవేదన

అధికారిక లంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు. సీఎస్ కి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇక గాంధీ ఆస్పత్రిపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాన్ఫరెన్స్ హాల్, సూపరింటెండెంట్ రూం మాత్రమే నీట్ గా ఉన్నాయని అన్నారు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ లీక్ అవుతోందని మండిపడ్డారు. త్వరలో ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తామన్నారు. సీఎంతో చర్చించి గాంధీ ఆస్పత్రి దుస్థితి మారుస్తామని తెలిపారు. గాంధీ ఆస్పత్రి పరిస్థితి అస్తవ్యస్తంగా వుందని అన్నారు. సీఎంకు ఇక్కడి పరిస్థితిని వివరించి త్వరలో గాంధీ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.
Nadendla Manohar: టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు..

Exit mobile version