NTV Telugu Site icon

Komatireddy: సచివాలంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy: నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రమాణం చేశారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో ఈ 5వ అంతస్త లోని 11 రూమ్ కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి భాద్యతలు స్వీకరించారు. రేపు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఎల్లుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ పర్యటించనున్నారు. అనంతరం బుధవారం అసెంబ్లీలో పలువురు అధికారులతో సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ను కలిపి సమావేశం నిర్వహిస్తారు. పాత కౌన్సిల్ భవనాన్ని ఖాళీ అధికారులు చేయించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనంలోని ఏపీ అసెంబ్లీ భవనాన్ని కౌన్సిల్ కోసం ప్రభుత్వం వినియోగించనుంది.

Read also: Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 119 స్థానాల్లో 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటిరెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మందికి చోటు దక్కనుంది. సీఎం సహా డిసెంబర్ 7న పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి కేబినెట్లో చోటు దక్కనుంది. ఆ ఆరుగురు ఎవరన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..