NTV Telugu Site icon

Komaram Bheem: తెలంగాణ సరిహద్దు దాటిన మరో పులి..

Adilabad Tigers

Adilabad Tigers

Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ రెండు పులుల్లో ఒకటి మగ పులి జానీ తాజాగా మహారాష్ట్రకు వెళ్లిపోయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు పులుల్లో ఒక పులి అయితే వెళ్లిపోయింది సరే.. మరో పులి జాడ ఏమైంది? అన్నట్లు ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు రెండో పులి జాడ కోసం చర్యలు చేపట్టారు. అయితే మరో పులి కూడా తెలంగాణ సరిహద్దు దాటినట్లు ఇవాళ అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. కెరమెరి, వాంకిడి మండలాల్లో వారం రోజులుగా సంచరిస్తున్న పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయినట్టు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వాంకిడి మండలంలోని ధాబా గ్రామ అటవీ ప్రాంతంలో ఆవుల మంద పై పులి దాడి చేసినట్లు గుర్తించారు. వాంకిడి మండలంలోని గోయేగాం గ్రామం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారి పక్కన పులి సంచార ఆనవాళ్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం పులి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించారు. పులి ప్రస్తుతం మహారాష్ట్రలోని కొస్తాడా అటవీ ప్రాంతంలో వెళ్లిపోయిందని, అక్కడ పశువుపై దాడి కూడా చేసిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా మగ పులి జానీ వెళ్లిపోగా ఇప్పుడు మరో పులి సైతం రాష్ర్ట సరిహద్దు దాటినట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇన్ని రోజులు పులి సంచారంతో భయాందోళన చెందిన ఆసిఫాబాద్ ప్రజలు పులి వెళ్లి పోయిందనే సమాచారంతో ఆనందం వ్యక్తం చేశారు.
Mahabubabad: మాల ధరించిన వారికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తారా.. తొర్రూరులో స్వాముల ఆందోళన..