Offer : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ స్థానికులను ఉత్సాహపరిచింది. నిత్యం వందల రూపాయల ధర పలికే షర్ట్ కేవలం రూ.5కే దొరుకుతుందని తెలిసిన వెంటనే ప్రజలు గుంపులు గుంపులుగా షాప్ ముందు చేరుకున్నారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న ఫంకీ ఫ్యాషన్ అనే దుకాణం యజమాని తన షాప్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదని, తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీని ఫాలో అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశాడు. అంతేకాకుండా కేవలం 150 మందికే ఈ ప్రత్యేక అవకాశం లభిస్తుందని, అది కూడా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తెలిపాడు.
Yasin Malik: హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ థాంక్స్ చెప్పారు.
ఈ వార్త క్షణాల్లోనే దావానలంలా వ్యాపించడంతో తెల్లవారుజాము నుంచే వందలాది మంది యువకులు దుకాణం ముందుకు తరలివచ్చారు. ఒక దశలో ఆ ప్రాంతంలో భారీగా జనసంద్రం ఏర్పడటంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. షాప్ ముందు గుమిగూడిన జనాన్ని నియంత్రించడానికి యజమాని తీవ్రంగా కష్టపడ్డాడు. ఎట్టకేలకు దుకాణం తలుపులు తెరిచి, క్యూలో ముందున్న 150 మందికి మాత్రమే కేవలం రూ.5కే షర్టులు అందజేశాడు. అయితే ఆ సంఖ్య దాటిన తర్వాత వచ్చిన వారు మాత్రం నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ వల్ల కొడంగల్ పట్టణం ఒకరోజంతా ఉత్సాహభరిత వాతావరణాన్ని అనుభవించింది. షాప్ ముందు కనిపించిన రద్దీ స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న మార్కెటింగ్ ఐడియా పట్టణాన్ని మొత్తం కదిలించిందని చెప్పాలి.
Philippines Protests 2025: ఫిలిప్పీన్స్‌లో నేపాల్ నిరసనల ప్రకంపనలు.. రాజకీయ సంక్షోభం తప్పదా?
