NTV Telugu Site icon

MBBS and BDS: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Knruhs

Knruhs

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ.. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ నెల 11 నుండి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలోని కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం.. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని.. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారని పేర్కొంది.. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం.

Read Also: CI Nageswara Rao: రివాల్వర్‌తో బెదిరించి మ‌హిళ‌పై అత్యాచారం.. సర్వీస్‌ నుంచి మాజీ సీఐ తొలగింపు..

Show comments