Site icon NTV Telugu

Missing Child Case: చిన్నారి ఇందు మృతి కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు

Missing Child Case

Missing Child Case

Missing Child Case: చిన్నారి ఇందు మృతి కేసులో దిగ్ర్బాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ పరిధిలో బాలిక ఇందు అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. నిన్న గురువారం ఉదయం 9గంటలకు పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు శుక్రవారం అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. నిన్న ఒంటిగంటకు పోలీసులకు ఫిర్యాదు చేసిన సాయంత్రం గర్ల్ మిస్సింగ్ కేస్ ను పోలీసులు కేసు నమోదు చేశారని బాలిక తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్ననే సెర్చ్ ఆపరేషన్ చేసుంటే బాలిక ఆచూకీ దొరకేదని చెబుతున్నారు. పోలీసుల జాప్యం వల్లే బాలికకు ఈ పరిస్థితి ఎదురైందనీ ఆరోపించారు.

Read also: Indian Workforce After Covid: కొవిడ్‌ తర్వాత కొలువుల సంఖ్య తగ్గినా.. పెరిగిన క్వాలిటీ జాబ్స్

పాప ఒంటిపై గాయాలు, నడుము భాగంలో గాయాలు గుర్తించామని చెబుతున్నారు. నిన్న రాత్రి చెరువు వరకు డాగ్స్‌స్క్వాడ్ వెళ్ళిందని, అక్కడ మమ్మల్ని పంపీయలేదని వాపోయారు. పోలీసులకు నిన్న రాత్రే విషయం తెలుసని, పోలీసులు దాచి పెట్టారని చెబుతున్నారు. మా పాపపై అఘాయిత్యానికి పాల్పడే చంపారని కన్నీరుమున్నీరవుతున్నారు బాధిత తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసే పోలీసులు నిన్న చెప్పకుండా దాచి పెట్టారంటున్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటుందని, అలాగే ఇటుక బట్టీలు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలుపుతున్నారు. వాళ్లలో ఎవరైనా పాపపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. ఎక్కడో వేరే దగ్గర చంపి తీసుకొచ్చి చెరువు దగ్గర పాప డెడ్‌బాడిని పడేశారని గుండెపగిలేలా రోదిస్తున్నారు. అయితే అనుమాదాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version