NTV Telugu Site icon

BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన

Kishanreddy

Kishanreddy

BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష ప్రారభమైంది. కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా…ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. రేపు ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న నిరుద్యోగ యువతకు సంఘిబావనికి ఈ ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంది యువత అన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అడిగితే కాల్చిపారేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తెలంగాణ కోసం విద్యార్థులు కాలికి గజ్జ కట్టి అడారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని 12 వందల మంది ఆత్మ బలిదానం చేసుకుందని అన్నారు. కెసిఆర్ కుటుంబం కి సంబందించిన వ్యక్తి ఒకరు పెట్రోల్ పోసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయనకు అగ్గిపెట్టె దొరకలేదని వ్యంగాస్త్రం వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతపై వివక్షతతో ఉందన్నారు. విశ్వ విద్యాలయాలు కల కల లడుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని అనుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు వస్తాయని భావించారని తెలిపారు. నిరుద్యోగ యువతను పథకం ప్రకారం మోసం చేసింది ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ చేతకాని తనం వల్ల పేపర్ లీకేజీ లు అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
MSMP: అనుష్కతో మాట్లాడే లక్కీ ఛాన్స్… ఆ లక్కీ లేడీస్ కి మాత్రమే