Kishan Reddy: మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్నా ఆయన ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అనంతరం ఆయన మట్లాడుతూ.. దేశంలో 7 దశలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మే 13న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయన్నారు. నగర ప్రజలను కొరేది ఒక్కటి అందరూ తమ ఓటు హక్కు వినియోగించాలి, ఓటు మన ప్రాథమిక హక్కు అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గురించి అబ్దుల్ కలాం ఇంతగా వివరించారో మనకు తెలుసన్నారు. ఎంఐఎం ఉన్న ప్రాంతాలలో 80 శాతం ఓటింగ్ పోల్ అవుతుందన్నారు. మనం నివసించే ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, పోలింగ్ శాతం పెంచే దిశగా క్యాంపెన్ చేయాలన్నారు.
Read also: Koona Srisailam Goud: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
ఎంఐఎం పోలింగ్ బూత్ లలో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. నాటి ముస్లిం రాజులు అనేక హిందూ దేవాలయాలను ద్వంసం చేశారు. నాటి బీజేపీ సభలకు ఆర్యవైశ్య భవనాల వేదికలుగా ఉండేవన్నారు. ఆర్యవైశ్యులు చాలా గొప్ప మనసు ఉన్నవారన్నారు. ముస్లిం రాజు ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తిరిగి నిర్మించారని తెలిపారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవంలో నెహ్రూ అనేక ఆటంకాలు సృష్టించారని తెలిపారు. అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం బిజెపి అనేక పోరాటాలు చేసిందన్నారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు.
Read also: Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు!
ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం రాముని గుడి కోసం పోరాటం చేసిన వాళ్లను కాల్చి చంపే సరైయి నదిలో వేసిందన్నారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్నారు. బీజేపీ మాట ఇచ్చినట్టుగా రామాలయాన్ని నిర్మించిందన్నారు. దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మోడీ చేపట్టారని తెలిపారు. అసరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్లు రెచ్చగొట్టిన ఏ ఒక్క ముస్లిం కూడా రామ మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించ లేదన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. పాకిస్థాన్‌ను ఒంటరిని చేశారన్నారు. 75 ఏళ్ల తర్వాత ఉగ్రవాద దాడుల నుండి భారతదేశంను విముక్తి చేశారని తెలిపారు.
Read also: Huge Amount Seized: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.40 లక్షలు సీజ్..!
దయచేసి జనాలందరూ ఈ విషయాలన్నీ ఆలోచించి మోడీని మళ్లీ గెలిపించాలన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలని దేశం కొరుకుంటుందన్నారు. మోడీ మంచి పరిపాలనతో దేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగేలా చేశారన్నారు. గుడ్ గవర్నెన్స్ ఈజీ ఆఫ్ డూయింగ్ లతో దేశానికి మంచి పరిపాల అందిస్తున్నారన్నారు. దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక దేశంగా నిలుపాలన్నదే మోడీ ఆశయమన్నారు. జాతీయ రహదారులకు విస్తరణ రైల్వే లైన్లో ఆధునికరణతో మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!