NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy Brs

Kishanreddy Brs

Kishan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని కోరారు. 50 శాతం కాంగ్రెస్ అభ్యర్థులకు కర్ణాటక సర్కారు నుంచి వచ్చిన డబ్బులిస్తే.. మిగిలిన 50 శాతానికి కేసీఆర్ డబ్బులు సమకూరుస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీ లను ఒడించడమే మా ప్రాధాన్యం అని తెలిపారు. రైతు బందుపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు పార్టీలూ తెరవెనుక చర్చలు జరుపుతూ.. బీజేపీని ఓడిద్దామని కుట్రలుచేస్తున్నాయని మండపడ్డారు. ఆవు ఎక్కడమేసినా.. పాలు ప్రగతి భవన్ లో ఇస్తే చాలు అన్నట్లు ఇద్దరూ సహకరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎవరు రాహుల్ గాంధీ ? అని ప్రశ్నించారు. అధికార పగ్గాలు వదిలిపెట్టి, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలి పారిపోయిన రాహుల్ ఇవాళ నీతులు వల్లెవేయడం హాస్యాస్పదం అన్నారు. మజ్లిస్ పార్టీ నీడపడిన ఏ పార్టీతోనూ బీజేపీ కలిసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ చరిత్ర ఏంటి? నీ పార్టీ చరిత్ర ఏంటి? మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీకి రమ్మంటావా? అమరవీరు స్థూపానికి వస్తావా? చర్చకు వస్తావా? అని సవాల్ విసిరారు.

ఎవరైనా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటంటే.. లాగి చెప్పుదెబ్బ కొట్టండని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదన్నారు. కలిసే ఆలోచన కలలో కూడా జరగదన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయంలో నేను స్పష్టంగా చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సంబంధం నీకు తెల్వదా? అని ప్రశ్నించారు. నీ గుర్తుమీద గెలిచిన వాళ్లు, బీఆర్ఎస్ లో మంత్రులుగా ఉంటే మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మాపై రుద్దుతారా? అని మండిపడ్డారు. నువ్వు మా గురించి మాట్లాడతావా రాహుల్ గాంధీ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్తమానంలో జరిగే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని రద్దుచేయం, చేయమని అడగం అన్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశామన్నారు. మేం కిసాన్ సమ్మాన్ నిధిని విజయవంతంగా రైతుల అకౌంట్లలో వేశాం.. కానీ వివాదాలకు తావు ఇవ్వలేదన్నారు. నేను కొట్టనట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యు అన్నట్లు.. ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు.

Read also: Harish Rao: ఓట్ల కోసం కాదు ప్రేమతో ఇచ్చాం.. రైతు బంధు ఆపిందే కాంగ్రెస్సే.

బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే.. సకాలంలో రైతులకు రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే.. నోటిఫికేషన్ కు ఒకరోజు ముందిస్తే ఏమయ్యేది? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికలపుడు దళితబంధు ఇస్తామని డ్రామాలు ఆడారు.. ఎన్జీవోలతో ఫిర్యాదుచేయించుకున్నారని అన్నారు. నేరుగా గెలిచే సత్తాలేకుండా.. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఎవడా హైదర్?…ఇది భాగ్యనగరం… మేం అధికారంలోకి రాగానే.. భాగ్యనగరం అని పేరుమారుస్తామన్నారు. మద్రాస్ చెన్నైగా.. కలకత్తాను కోల్ కతాగా మార్చినప్పుడు.. బాంబే పేరు ముంబైగా మార్చినపుడు.. హైదరాబాద్ పేరు మార్చడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చామని స్పష్టం చేశారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, బానిస మనస్తత్వానికి ప్రతీకలను తొలగించి.. ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా పేర్లు తీసుకురావడం తప్పేంలేదన్నారు. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గామార్చాం. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. బానిస మనస్తత్వానికి ప్రతీకలను తొలగించమని అన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా పేర్లు తీసుకురావడం తప్పేంలేదన్నారు. ముస్లింలపై మాకు కోపం లేదు.

వారి సంక్షేమం జరగాలనేదే మా ఆలోచన అన్నారు. ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మజ్లిస్ పార్టీపైనే మాకు కోపం అని స్పష్టం చేశారు. ‘మోడీ హైతో ముమ్‌కీన్ హై’ అన్నారు. నాకు నైతిక విలువలున్నాయని, పార్టీనుంచి బయటకు పోయినవారిమీద నేనెప్పుడూ విమర్శలు చేయలేదు చేయనని అన్నారు. నా ఇంటికి ఏ ఏజెన్సీలు వచ్చినా నేను భయపడను అని అన్నారు. తప్పుచేయకపోతే.. భయమెందుకు అని ప్రశ్నించారు. తను సంపూర్తిగా సహకరిస్తానని అన్నారు. అంతే తప్ప.. గోల చేస్తే లాభం లేదన్నారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న కేసీఆర్ ఓడిపోతున్నాడనే విషయం ఆయనకు, వాళ్ల పార్టీకి అర్థమైందన్నారు. ప్రజలు అనుకుంటే ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఈసారి బీఆర్ఎస్ పీడ విరగడ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఒకవేళ మెడికల్ కాలేజీల విషయంలో వందలెటర్లు రాశానని చెబుతున్న కేసీఆర్ ఇందులో 50 లెటర్లు బయటపెట్టినా.. నేను రాజకీయాలనుంచి తప్పుకుంటానని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాటమీద నిలబడాలని తెలిపారు. మా కేంద్రమంత్రి హర్షవర్ధన్ లేఖలు రాస్తే సమాధానం ఇవ్వని నువ్వు మాట్లాడతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కేసీఆర్ కాదు, వందమంది రాహుల్ గాంధీలు, వెయ్యిమంది ఒవైసీలు వచ్చినా.. 2024లో మోడీని ప్రధాని కాకుండా ఆపలేరని అన్నారు.
Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్‌