Kishan Reddy: త్వరలోనే జ్ఞానవాపి పై నిజానిజాలు బయటకు వస్తాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంకు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి ఎపిగ్రఫీ మ్యూజియం.. సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.ఈ ఎపిగ్రఫీ మ్యూజియంలో ప్రాచీన శాసనాల ప్రదర్శన, వాటిపై అధ్యయనం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇవాళ భూమి పూజ చేసుకున్నామన్నారు. శిలా శాసనాలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. దేశంపై అనేక మంది దండయాత్రలు చేయడం వల్ల గత చరిత్ర శిలా శాసనాలు కనుమరుగయ్యాయన్నారు. శిలా శాసనాలపై రకరకాల లిపి ఉంటుంది, అది వారి జీవన విధానానికి అడ్డంపడుతోందని అన్నారు. శాసనాలు దేశ చరిత్రకు వెన్నెముక లాంటిదన్నారు. శాసనాలను కాపాడాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. రకరకాల లిపిల రూపంలో శాసనాలు కనిపిస్తున్నాయన్నారు.
శిలా శాననాలపై లిఖించిన లిపిని డీ కోడ్ చేసే అధ్యయన సిస్టం ఈ మ్యూజియంలో ఉంటుందన్నారు. గతంలో ఇట్లాంటి మ్యూజియం పెట్టుకునేందుకు భూమి కోసం కెసిఆర్ కు అనేక సార్లు లేఖలు రాశాను, జవాబు రాలేదన్నారు. ఏపి గ్రఫీ మ్యూజియాo ఏర్పాటుకు ప్రధాని కృషి ఉంది.. ప్రధానికి ప్రత్యేక దున్యవాదాలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దబోతున్నామన్నారు. శిలా శాసనాలపై ఉన్న లిపిలను డిజిటలైజ్ చేసి, అందరికీ అర్థమయ్యేలా వారి వారి మాతృ భాషాల్లోకి మార్చేందుకు కృషి చేస్తామన్నారు. జ్ఞానావాపిలో అనేక శాసనాలు ఉన్నాయని, జ్ఞానవాపిలో లో ఉన్న చరిత్రను ప్రజల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ కృషితో గ్నానవాపిలో ఉన్న ఆధారాలను రీసెర్చ్ చేసి కోర్టు ముందు ఉంచారన్నారు. కోర్టు చాలా తక్కువ సమయం ఇచ్చిందని, త్వరలోనే జ్ఞానవ్యాపి పై నిజ నిజాలు బయటకు వస్తాయన్నారు. గత చరిత్ర అంతా శిలాశాసనాల మీదే ఉండేదని, భావితరాల కోసం శిలా శాసనాల చరిత్ర కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక దండయాత్రల వల్ల దేశంలో శిలా శాసనాలు ద్వంసం అయ్యాయని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పుడు మరువకూడదన్నారు. సాలార్జంగ్ మ్యూజియం రూపు రేఖలు మార్చామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో శాలర్జంగ్ మ్యూజియాన్ని అభివృద్ధి చేశామన్నారు.
ఆధునిక టెక్నాలజీతో ఇంకా మెరుగ్గా మ్యూజియాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఎపిగ్రఫి మ్యూజియం రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాతే దేశంలో మ్యూజియంలు ఆధునిక టెక్నాలజీ తో అభివృద్ధి చెందాయన్నారు. మన దేశ చరిత్రను, శిలా శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ మ్యూజియాన్ని హైదరాబాద్ కు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. శుబాష్ చంద్ర బోస్ త్యాగం మరువలేనిదన్నారు. బోస్ జీవిత చరిత్ర ఆధారంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం డిల్లీ రాష్ట్రపతి భవనానికి అటూ ఇటూ నార్త్ సౌత్ బ్లాక్ లో ఏర్పాటు కాబోతుందని తెలిపారు. 1947 నుంచి నేటి వరకు వివిధ దేశాలు కొల్లగొట్టిన శాసనాల చరిత్రను తిరిగి దేశానికి తెచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. మోడీ చోరువతో వివిధ దేశాలనుంచి 314 దేశ కళా సంపదను దేశానికి తీసుకొచ్చామన్నారు. శిలా శాసనాలు, నాణేలు, గత సంపద ఎక్కడ కనిపించినా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. దేశ అస్తిత్వానికి ప్రతీకలు శాసనాలని, దేశ చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఐదు నెలల్లో ఎపిగ్రఫీ మ్యూజియం రూపుదిద్దుకావాలని అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
IND vs ENG: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. వైజాగ్ టెస్టులో భారత్ ఘన విజయం!