NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాక పోతే.. కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బీజేపీ అధికారం లోకి రాక పోతే రాష్ట్రము అధోగతి పాలు అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం మద్దతు ధర 3,100 కు కొంటామన్నారు. రైతుల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత స్కీమ్స్ కంటిన్యూ చేస్తూ.. ఇన్పుట్ సహాయంగా అదనంగా మరో 2 వేల 500 రూపాయల ఇస్తామన్నారు. రైతుల మీద భారం పడకుండా పంటల భీమా అమలు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కేసీఆర్ సింగరేణిని ప్రైవేట్ పరం చేసి బీజేపీ పై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అధికారం లోకి వస్తె సింగరేణినీ పటిష్టం చేస్తామన్నారు. ఐటీ ను రిటర్న్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మహిళలకు 10 లక్షలు ఉద్యోగాలని హామీ ఇచ్చారు. తెలంగాణను ఆదుకోకపోతే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటకలో 5 గ్యారంటీలకు దిక్కులేదు… ఇక్కడ 6 గ్యారంటీ లు ఎలా అమలు చేస్తారని కాంగ్రెష్ పై మండిపడ్డారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ముందుకు వెళ్తామన్నారు. ఈ పార్టీ నీ నడిపించలేను అంటూ విదేశాలకు రాహుల్ గాంధీ పారిపోయాడని, ఆ పార్టీ నా మాకు నీతులు చెప్పేదంటూ మండిపడ్డారు. డిపాజిట్ రాని బీజేపీ బీసీనీ ఎలా సీఎం చేస్తుందని బీసీలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పార్టీకి జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ లలో డిపాజిట్ రాలేదని, వాళ్ళు ఎలా 6 గ్యారంటీ లు అంటున్నారని తెలిపారు. కేసీఆర్ ది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ… ఒక ఫ్యుడలిస్ట్ పోతే మరో ప్యూడలిస్ట్ వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి ప్రచారం చేస్తుందని, ఆ నలుగురే మిగతా వాళ్ళను తిరగనియ్యరని తెలిపారు. తను రెడ్డినీ ఒక రెడ్డి నీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించిన తర్వాత బీసీనీ సీఎం చేస్తామని చెప్పిందని.. ఇది బీజేపీ సమాజిక న్యాయమన్నారు. రిజర్వేషన్ పరిధిలో రాని వారికి కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వం దే అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి పైన రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ తో విచారణ జరిపిస్తామన్నారు. ఎంత పెద్ద వారైన వదిలిపెట్టమని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాక పోతే రాష్ట్రము అధోగతి పాలు అవుతుందన్నారు. ప్రధానమంత్రి సభలు 6 పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు, ఎమ్మెల్యే ఓటు మాకు వేయండి… ఎంపి ఓటు బీజేపీకి వేయాలని అడుగుతునట్టు తెలుస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ఓటు అయినా.. ఎంపీ ఓటైనా ప్రజలు మాకే వేస్తారని అన్నారు. ఇలా ప్రచారం చేస్తే ఆ రెండు పార్టీలను పాతర వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Telangana Election 2023: తెలంగాణలో ఇంటి వద్దే ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ

Show comments