Site icon NTV Telugu

Kishan Reddy: బస్తీ దవాఖానాలకు మోడీనే నిధులు ఇస్తున్నారు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బస్తీ దవాఖానాలకు మోడీనే నిధులు ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగ్ అంబర్ పేట్ మల్లికార్జున నగర్ బస్తీ లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పదమూడు కోట్ల టాయిలెట్లను కట్టించారు మోడీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కారణంగా ఇండ్లు కట్టలేదన్నారు. దేశంలో నాలుగు కోట్ల ఇళ్లను కట్టించారు మోడీ అన్నారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న పేదలకు అందరికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నామన్నారు. కరోనా సమయంలో పేదల ప్రాణాలు కాపాడటం కోసం ఉచిత వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. బస్తీ దవాఖానలకు మోడీనే నిధులు ఇస్తున్నారని తెలిపారు. స్కూల్ లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

Read also: China: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో నాలుగు దేశాల వైమానిక విన్యాసాలు

గాంధీ, ESI హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశాం.. అది పూర్తవుతే హైదరాబాద్ విస్తరిస్తుందన్నారు. అంబర్ పేట్ బిడ్డగా ఎమ్మెల్యేగా నన్ను మూడు సార్లు గెలిపించారని తెలిపారు. మీ బిడ్డగా మరోసారి మీ ముందుకు వచ్చానని అన్నారు. వచ్చే నెల 13 తేదీన ఓటేసి.. నన్ను మోడీని గెలిపించాలని కోరారు. అనంతరం శివంరోడ్ లో సత్యసాయి సేవా సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి అమీర్ పేట్ కీర్తి అపార్ట్మెంట్స్ వాసులతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ చేపట్టే ప్రయోజనాలను వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
Show Cause Notice: ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన ఉద్యోగులు.. షోకాజ్‌ నోటీసులు

Exit mobile version