NTV Telugu Site icon

Kishan Reddy: పంచె కట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: పార్లమెంట్ లోకి పంచె కట్టులో కిషన్ రెడ్డి అడుగుపెట్టారు. తెలుగు తనం ఉట్టి పడుతూ కిషన్ రెడ్డి పార్టమెంట్ లో ప్రవేశించారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం నేతృత్వంలో 18వ లోక్‌సభ జరుగుతోంది. సమావేశం ప్రారంభమైన తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి గెలిచిన బండి సంజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులిద్దరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. తొలుత ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Read also: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్!

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ లో పంచె కట్టులో కనిపించారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన వారు రేపు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకే రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు కేరళలోని వాయనాడ్‌ స్థానానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయనాడ్‌ సీటును వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజర్స్ కి అలర్ట్.. త్వరలో కొన్ని ఖాతాలు డీయాక్టివేట్..