NTV Telugu Site icon

Kishan Reddy: నితిన్ గడ్కరితో కిషన్ రెడ్డి సమావేశం.. ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చ

Nithin Ghatkari, Kishan Reddy

Nithin Ghatkari, Kishan Reddy

Kishan Reddy: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. గురువారం ఢిల్లీలో గడ్కరీని కలికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తొలిసారిగా ఈరోజు తెంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా సెల్యూట్ తెలంగాణ పేరుతో రాష్ట్ర బీజేపీ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

Read also: NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌తో తేజస్వీ యాదవ్‌కు సంబంధం ఉంది..

ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలు పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు ఏర్పాట్లు చేశారు. సభలో మంత్రులకు, ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తరవాత భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు నేతలు దర్శించుకోనున్నారు. రసూల్ పూర, ప్యారడైజ్, రానిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, హిమాయత్ నగర్ ల మీదుగా బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీని చేపట్టనున్నారు. ర్యాలీ జరిగే రూట్ లో భారీగా ఫ్లెక్సీ లు, బానర్ లు, జండాలు, హోర్డింగ్స్ లను బీజేపీ నేతలు ఏర్పాటు చేసారు. తెలంగాణ పేరుతో నిర్వహించే ఈ ర్యాలీలో లక్ష్మణ్, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయ వేదికపై నుంచి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతామని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న కార్యకర్తలు, నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపనున్నారు.
Bandi Sanjay: బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు..