Site icon NTV Telugu

ఆగస్టు 19 నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Kishan Reddy

ఆగస్టు 19 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించబోయే.. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానుంది. కోదాడ నుండి హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఖిల్లాషాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారు. వరంగల్ లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారు.

ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు( కార్మికులు) చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు. 21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అందిస్తున్న ఉచిత బియ్యం పథకం ప్రజలకు చేరుతున్నా అంశాలను రేషన్ షాప్ సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరు కుంటారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సభ ఉంటుంది. 12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు జి కిషన్ రెడ్డి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.

Exit mobile version