Site icon NTV Telugu

Kishan Reddy: చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి మోడీ ని ఆహ్వానిస్తాం

Kishanreddy Secendrabad

Kishanreddy Secendrabad

Kishan Reddy: చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి మోడీ ని ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం ప్రభుత్వం కృష్టి చేస్తుంన్నారు. గతేడాది ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మొత్తం మూడు దశల్లో పనులు.. మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్లాట్ ఫామ్ 1లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. చాలా తక్కువ సమయం లో వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నారని తెలిపారు.

Read also: Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం.. ఈనెల 16న మహాధర్నాకు పిలుపు..?

2025 నవంబర్ కల్ల పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి మోడీ ని ఆహ్వానిస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషనల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30 కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులు నేరుగా స్టేషన్ లోకి రావడానికి బయటికి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
Special Train to Ayodhya: ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. జెండా ఊపి ప్రారంభించిన పురంధేశ్వరి

Exit mobile version