NTV Telugu Site icon

Kishan Reddy: జనసేనతో బీజేపీ దోస్త్‌ కటీఫ్‌..! కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy Pavan Kalyan

Kishanreddy Pavan Kalyan

Kishan Reddy: జనసేనతో బీజేపీ దోస్తీ కటీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికల రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం ఉండదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ల అమలు పై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందని అన్నారు. ఈ నెల 17న సుప్రీం కోర్టులో కేసు ఉందన్నారు. ఆ లోపే ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తుందని.. బీజేఎల్ పీ నేత ఎంపిక ఎప్పుడైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని అన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీ లు వేస్తున్నామని అన్నారు. వాళ్లతో మీటింగ్ ఉంటుందన్నారు.

Read also: South Korea : ప్రెస్ మీట్లో ఉండగానే ప్రతిపక్ష నేతపై దాడి… మెడపై కత్తిపోట్లు

మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదు? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. భవిష్యత్ లో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటుందన్నారు. అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని అన్నారు. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నమని, జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని అన్నారు.
South Korea : ప్రెస్ మీట్లో ఉండగానే ప్రతిపక్ష నేతపై దాడి… మెడపై కత్తిపోట్లు

Show comments