NTV Telugu Site icon

Khammam: ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే..

Nhatti

Nhatti

కురిసిన భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంబంధించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు వద్ద కేంద్ర మంత్రులు వర్షం నష్టాన్ని పై అంచనా వేసేందుకు ఫోటో యాక్టివేషన్ ని తిలకించ నున్నారు. అయితే విజయవాడ నుంచి బయలుదేరిన కేంద్రమంత్రులు శివ రాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హెలికాప్టర్ లో బయలుదేరి మధిరలో, ఖమ్మంలో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టం ను పరిశీలించారు. అనంతరం పాలేరు చేరుకున్నారు. పాలేరులో వర్షం వల్ల వరద వల్ల జరిగిన నష్టాన్ని రైతులతో అడిగి తెలుసుకోనున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం భారీ వర్షం రావడంతో పాలేరు ట్యాంక్ బండపై ఏర్పాటు చేసిన టెంట్లు ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం కూలిపోయాయి. దీంతో కార్యక్రమాన్ని పాలేరు నవోదయ ఆడిటోరియంలో అధికారులు ఏర్పాటు చేశారు.

Read also: ప్రముఖ గణేష్ దేవాలయాలు ఇవే.. ఒక్కసారి లుక్‌ వేయండి.

అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో శివరాజ్ సింగ్, బండి సంజయ్ మాట్లాడనున్నారు. అక్కడి నుండి మోతె హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నాఉ. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట చేరుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్నారు. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లనున్నట్లు సమాచారం. శివరాజ్ సింగ్ కు వీడ్కోలు అనంతరం బండి సంజయ్ నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో కోదాడ పర్యటనను రద్దు చేసుకున్నారు బండిసంజయ్.
KCR Navagraha Yagam: ఎర్రవల్లిలో కేసీఆర్‌ దంపతులు నవగ్రహ యాగం..

Show comments